BIG BREAKING : అల్లు అర్జున్ కు బిగ్ షాక్

Allu arjun

BIG BREAKING :  టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తో పాటుగా మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు. ఈ కేసు ఛార్జిషీట్‌లో ఏ-11గా అల్లు అర్జున్‌ పేరు చేర్చారు పోలీసులు.

2024 డిసెంబర్ 4న ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద భారీ ఎత్తున అభిమానులు గుమిగూడారు. ఒక్కసారిగా జనసందోహం పెరిగిపోవడంతో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుధీర్ఘకాలం చికిత్స తర్వాత శ్రీతేజ్ డిశ్చార్జి అయ్యాడు.

ఈ కేసులో హీరో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా (A-11) పోలీసులు పేర్కొన్నారు. థియేటర్ యాజమాన్యాన్ని ప్రధాన నిందితులుగా (A-1-A-4) చేర్చగా, అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ టీమ్, నిర్మాణ సంస్థ ప్రతినిధులను కూడా ఈ జాబితాలో చేర్చారు. క్రౌడ్ కంట్రోల్ చేయడంలో విఫలమవ్వడం, సరైన ప్రణాళిక లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేశారు.

ప్రస్తుతం కోర్టు ఈ ఛార్జ్‌షీట్‌ను పరిశీలిస్తోంది. త్వరలోనే నిందితులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో తదుపరి చట్టపరమైన పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.