కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల ఇంట్లో విషాదం

తెలంగాణ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌, సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య సోదరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి మనవడు ధృపత్‌(22) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. గచ్చిబౌలి పోలీసు స్టేషను పరిధిలోని విప్రో సర్కిల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ధృపత్‌ డివైడర్‌ను ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ధృపత్ ఫైల్ ఫోటోస్ 

LEAVE A REPLY