బిగ్ బాస్ 3 విన్నర్….రాహుల్ సిప్లిగంజ్

బిగ్ బాస్ 3 విన్నర్….రాహుల్ సిప్లిగంజ్

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ గెలిచాడు. టాప్ 2లో నిలిచిన శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. 105 రియాలిటీ షో ముగిసింది. ఫైనల్‌లో విజేతగా రాహుల్ నిలిచాడు. అలీ రైజా, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్ తర్వాత… చివరగా ఫైనల్‌లో శ్రీముఖి, రాహుల్ నిలిచారు. చివరగా మెగాస్టార్ చిరంజీవి ఈ  ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసారు. చిరంజీవికి నాగార్జున పూల బోకే తో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ అనేది ప్రపంచంలో అతిపెద్ద రియాలిటీ షో అని పేర్కొన్నారు. తాజాగా  బిగ్‌బాస్ 3  హోస్ట్ అయిన నాగార్జున.. హౌస్‌లో ప్రవేశించి ఫైనల్‌లో నిలిచిన  శ్రీముఖి, రాహుల్ ‌ఇద్దరికీ  ఒక ఆఫర్ ప్రకటించాడు. ఫైనల్‌గా శ్రీముఖి, రాహుల్‌ను  స్టేజ్ మీదికి తీసుకొచ్చి..బిగ్‌బాస్ 3 విజేతగా రాహుల్‌ నిలిచినట్టు నాగార్జున సమక్షంలో చిరంజీవి ప్రకటించారు. 

అంతుకుముందు బిగ్‌బాస్ 3 ఫైనల్‌ కోసం పెద్ద పెద్ద హీరోయిన్స్‌తో స్పెషల్ డాన్స్ షోలు ఏర్పాటు చేసింది స్టార్ మా నిర్వాహాకులు. ఇప్పటికే కేథరిన్, అంజలి ఈ షోలో తమ డాన్సులతో ఈ షోకు జోష్ తీసుకొచ్చారు. ముందుగా మారుతి, అంజలి హౌస్‌లో వెళ్లి అలీ రెజాను హౌస్‌ బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీకాంత్ హౌస్‌ మేట్స్ కి రూ.10 లక్షల ఆశ చూపెట్టాడు. ఆ తర్వాత వరుణ్ సందేశ్ రూమ్‌లోకి వెళ్లి మరో రూ.20 లక్షలు తీసుకొచ్చాడు. కానీ ఎవరు టెంప్ట్ కాలేదు.  శ్రీకాంత్, కాథరీన్ కలిసి  టాప్4లో ఉన్న వరుణ్ సందేశ్‌ను హౌస్ బయటకు  తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు కాస్తంత భావోద్వేగానికి గురయ్యాడు. వరుణ్ సందేశ్ ఎలిమినేషన్ తర్వాత టాప్ 3లో శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్ నిలిచారు.  ఆ తర్వాత అంజలి హౌస్‌ లోపలి వెళ్లింది. బిగ్‌బాస్ మొదట హౌస్ నుండి స్వచ్ఛందంగా బయటకు వెళ్లే వారికి రూ. 10 లక్షల ఆఫర్ ప్రకటించాడు. ఆ తర్వాత రూ.25 లక్షలు ప్రకటించాడు. అయినా ఎవరు ఈ ఆఫర్‌కు స్పందించలేదు. ఆ తర్వాత అంజలి బాబా భాస్కర్‌ను హౌస్ నుండి ఎలిమినేట్ చేస్తున్నట్టు  ప్రకటించింది. మిగిలిన శ్రీముఖి, రాహుల్ లలో రాహుల్ విజేతగా నిలిచాడు.