రీనా ద్వివేది : పోలింగ్ ఆఫీసర్ మళ్లీ మెరిసింది

రీనా ద్వివేది. ఉత్తర్ ప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా లక్నోలో ఎన్నికల విధుల నిర్వహిస్తూ రాత్రికి రాత్రి దేశం దృష్టిని ఆకర్షించిన ఆఫీసర్. ఆమె మరోసారి తన మార్క్ అట్రాక్షన్ చూపించింది. ఉత్తర్ ప్రదేశ్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో భాగంగా కృష్ణా నగర్ మహానగర్ పబ్లిక్ ఇంటర్ కాలేజీలో పోలింగ్ నిర్వహించారు రీనా ద్వివేది. పింక్ కలర్ శారీలో ట్రెండీ గాడ్జెట్స్ తో కనిపించారు. ఆమెను గుర్తుపట్టిన ఫోటోగ్రాఫర్లు క్యాప్చర్ చేసే ప్రయత్నం చేశారు. విధినిర్వహణతో పాటు ఫ్యాషన్ లోనూ తన టాలెంట్ చూపించారామె.

రీనా ద్వివేది, పోలింగ్ ఆఫీసర్

మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఎల్లో కలర్ శారీలో ఈవీఎం బాక్సులు తీస్కెళ్తూ ఫోటోగ్రాఫర్ల కంటపడ్డారు. అప్పట్లో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి. ఆమె బయోడేటా కోసం గూగుల్ సెర్చింజిన్ లో వెతకని వాళ్లంటూ లేరు. ఎన్నెన్నో కథనాలు రాశారు. చివరికామె యూపీ ప్రభుత్వం PWD ఆఫీసర్ గా పనిచేస్తున్నట్టు తేలింది. చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్న రీనా ద్వివేదికి 15 ఏళ్ల కొడుకు ఉన్నాడు. 2013లో ఆమె భర్త చనిపోవడంతో PWDలో ఆమెకు జాబ్ వచ్చింది. కొడుకును ఉన్నత చదువులు చదివించే లక్ష్యంతో నిబద్ధతతో పనిచేస్తున్నారామె. 2014, 2017, 2019 ఎన్నికల్లో ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించడంతో తాజా ఉప ఎన్నికల్లో రీనా ద్వివేదికి మళ్లీ అవకాశమిచ్చింది ఎన్నికల సంఘం.