Republic Day Sale 2026 iPhone Deals : IPhone లవర్స్ కు పండగే.. కళ్లు చెదిరే డిస్కౌంట్లు మావా!

Republic Day Sale 2026 iPhone Deals

Republic Day Sale 2026 iPhone Deals : Republic Day సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు ఐఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించాయి. మీరు కొత్త ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన టైమ్. తాజాగా విడుదలైన iPhone 17 సిరీస్‌తో పాటు పాత మోడల్స్‌పై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్(Republic Day Sale 2026 iPhone Deals) కళ్లు చెదిరే తగ్గింపులను అందిస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఆఫర్లు:

ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లో iPhone 17 ధరను భారీగా తగ్గించింది. అసలు ధర రూ. 82,900 ఉన్న ఐఫోన్ 17ను, హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు, ఆఫర్లతో కలిపి కేవలం రూ. 74,999 కే సొంతం చేసుకోవచ్చు. పాత ఐఫోన్ 15 మోడల్స్‌పై కూడా అద్భుతమైన ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Sale): ప్రీమియం మోడల్స్ కోరుకునే వారి కోసం అమెజాన్ అదిరిపోయే డీల్స్ తెచ్చింది. ఎస్‌బీఐ (SBI) బ్యాంక్ ఆఫర్లు, కూపన్లతో కలిపి రూ. 1,49,900 విలువైన iPhone 17 Pro Max ను రూ.1,40,400 కే ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా, సరికొత్త iPhone Air మోడల్ ఆఫర్ల తర్వాత లక్ష రూపాయల లోపు ధరకే లభిస్తోంది. ఐఫోన్లతో పాటు యాపిల్ యాక్సెసరీలపై కూడా అమెజాన్ భారీ తగ్గింపులను ఇస్తోంది.

Also Read :

విజయ్ సేల్స్ (Vijay Sales) ఆఫర్లు: విజయ్ సేల్స్ కూడా ఈ రేసులో వెనుకబడలేదు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ వాడే వారికి ఐఫోన్ 17 సుమారు రూ.78,900 కే లభిస్తోంది. దీనితో పాటు లాయల్టీ పాయింట్లను కూడా అందిస్తున్నారు, వీటిని భవిష్యత్తులో ఇతర వస్తువుల కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చు. లేటెస్ట్ ఫీచర్లు అవసరం లేదనుకునే వారి కోసం పాత ఐఫోన్ మోడల్స్‌ను విజయ్ సేల్స్ అతి తక్కువ ధరకే విక్రయిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, విజయ్ సేల్స్‌లో ధరలను పోల్చి చూసి, బెస్ట్ డీల్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.