తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ కుంపటి పార్టీ కొంపముంచేలా ఉంది. ఇప్పటికే రేవంత్ వర్సెస్ సీనియర్లుగా ఉంది పరిస్థితి. పీసీసీ పదవి విషయంలో రేవంత్ బ్యాచ్ చేసిన ఓవరాక్షన్ తో…పార్టీ సీనియర్లు ఆ పదవికి అడ్డుకట్ట వేశారు. నిన్నగాక మొన్నొచ్చిన వాళ్లకు పీసీసీలు ఇస్తే… మేమేంతా ఏం చేయాలి అంటూ బాహాటంగానే అధిష్టానం దగ్గర ఫిర్యాదులతో పాటు, అల్టీమేటం కూడా ఇచ్చారు. దీంతో పీసీసీ పదవిని హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం. ఆ లోపే హుజూర్ నగర్ ఇష్యూ. నా భార్యనే పోటీకి దించుతానని ఉత్తమ్.. తన బ్యాచ్ వాళ్లను బరిలో దింపాలని రేవంత్. ఇక్కడ కూడా ఉత్తమ్ దే పైచేయి. పార్టీ పెద్దలు కూడా ఉత్తమ్ కే మద్ధతిచ్చారు. దీంతో మరింత డిసప్పాయింట్ అయిన రేవంత్….ఇక అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవడానికే ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. పార్టీలో నాకు సముచిత న్యాయం జరగడం లేదని.. తనకు పీసీసీ ఇస్తే గానీ పార్టీలో కొనసాగేది లేదని తేల్చుకోవడానికే ఢిల్లీ వెళ్లినట్లు ఆయన సన్నిహితులు గుసగుసలాడుకుంటున్నారు.

అయితే…ఇప్పట్లో పీసీసీ మార్పు ఉండకపోవచ్చని సమాచారం. హుజూర్ నగర్ ఫలితాలను బట్టి పీసీసీపై నిర్ణయం ఉంటుంది. హుజూర్ నగర్ లో అధికార పార్టీపై పద్మావతి గెలిస్తే… ఉత్తమ్ పీసీసీ సీటు సేఫ్. ఒకవేళ ఓడిపోతే మాత్రం… ఇక ఏమాత్రం ఆల్చం చేయకుండా వెంటనే పీసీసీని మార్చే ఛాన్స్ ఉంటుంది. కానీ….ఆ రేసులో రేవంత్ రెడ్డి ఎన్నో ప్లేస్ లో ఉంటాడనేదే ఇప్పటికీ అర్థంకాని విషయం. చూడాలి మరి ఏం జరుగుతుందో…