యూనియన్ల విషకౌగిలి నుంచి కార్మికులు బయటపడాలె : కేసీఆర్

యూనియన్ల విషకౌగిలి నుంచి కార్మికులు బయటపడాలె : కేసీఆర్

ఆర్టీసీ కార్మికులు మంచివాళ్లే. ఆర్టీసీలో అనుభవం గల అధికారులూ ఉన్నారు. సమస్యంతా యూనియన్ నేతలే. వాళ్ల విషకౌగిలి నుంచి కార్మికులు బయటపడాలె. అట్లైతెనె కార్మికులు మంచిగ బతుకుతరు. యూనియన్ నేతలను నమ్ముకుని కూర్చున్న కొమ్మల్నే నరుక్కుంటున్నరు. ఆర్టీసీ సమ్మెనుద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి. కార్మికుల సంక్షేమం కోరుకునే వాళ్లైతే ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేయరని మండిపడ్డారు సీఎం. పండగపూట రోజు రూ.11 కోట్ల ఆదాయాన్ని వదులుకుని రోడ్ల మీదకు తెచ్చిన్రు. ఆర్టీసీని నిండా ముంచుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీపై తనకు సానుభూతి ఉందన్న సీఎం… తిరిగి చేరాలనుకునే కార్మికులు ఎక్కడికక్కడ డిపోల్లో దరఖాస్తులు పెట్టుకుని విధుల్లోకి రావాలని సూచించారు. ఏది ఏమైనా ప్రైవేటు పర్మిట్లకు అనుమతిస్తామని 5-6 వేల బస్సులకు పర్మిట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కంటే నాణ్యమైన సర్వీసులు తక్కువ ఛార్జీలతో అందిస్తాయన్నారు. ఆర్టీసీని ఆర్టీసీ వాళ్లే ముంచుతున్నరని ఆర్టీసీ కథ ముగిసినట్టేనని అన్నారు. ఆర్టీసీ తరఫున న్యాయవాదులు కోర్టు ముందు పచ్చి అబద్దాలు చెప్తున్నారని… సమ్మెతో సంస్థకు తీవ్ర నష్టం జరుగుతోందని.. ఇక దాన్నెవరూ కాపాడలేరని స్పష్టం చేశారు.