సంపూ గొప్ప మనసు…వరద బాధితులకు సాయం

సంపూర్ణేష్ బాబు తనకంటూ తెలుగు సినిమాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. చాల రోజలు గ్యాప్ తర్వాత కొబ్బరిమట్ట సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే సంపూ ఎంత కామేడీ పంచుతాడో అంత మానవత్వం చాటే మనిషని నిరూపించుకున్నాడు. కొబ్బరి మట్ట సినిమా హిట్ టాక్ తో సంతోషంలో ఉన్నాడు సంపూర్ణేష్ బాబు. కానీ తాను సంతోషం ఉంటే ఎదుటి వారు దు:ఖంలో ఉండటం చూసి చలించిపోయాడు. అందుకే తన వంతుగా వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవాలనుకున్నాడు.

కర్నాటకలో వరద బాధితులకు చేయూతగా నిలిచాడు. రూ.2లక్షలు సాయం చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తానని ప్రకటించాడు. ఉత్తర కర్ణాటక లో వరదలు నన్ను కలిచివేసింది. కన్నడప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా హృదయకాలేయం నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫోటోలు చూసి చాలా బాధవేసింది. నా వంతుగా 2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిది కి ప్రకటిస్తున్నాను. అని సంపూ వరదల ఫోటోలు పెట్టి ట్వీట్ చేశాడు.

అలాగే కన్నడలో కూడా రాసిన ట్వీట్ ను పోస్ట్ చేశాడు. సంపూ సాయంపై అందరూ అభినందిస్తున్నారు. చిన్న నటుడైనా తన వంతు సహాయం చేశాడని పొగడ్తలతో ముచేత్తుతున్నారు. దాదాపు 40వేల ఇళ్లు వరదలకు ధ్వంసం అయ్యాయి. 2వేలకు పైగా గ్రామాలు నీటమునిగాయి. వరదల నష్టం నుంచి గట్టెక్కించడానికి పలువురు తమ వంతు సహాయం చేస్తున్నారు. కర్నాటక వరదలకు కేంద్రం రూ.52కోట్లు తక్షణ సాయం కింద విడుదల చేసింది.

మొన్నటి నుంచి భారీగా కురుస్తున్న వర్షాలకు ఏపీలోనూ వరదలు పోటెత్తాయి. గోదావరి జిల్లాలు, లంక గ్రామాలు నీట మునిగాయి. వరదలతో సొంత ఊరిని వదిలివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు ఎగువన ముంబై, కర్నాటక రాష్ట్రాలు వరదలతో నీట మునిగాయి.  మరీ గోదావరి జిల్లాలో నీట మునిగిన గ్రామాలకు ఏం చేస్తాడో చూడాలి!

LEAVE A REPLY