సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన సైరా వచ్చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రీమీయర్ షోలు పడ్డాయి. అంతా పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతోంది సైరా. అటు యూఎస్ ప్రీమియర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ఇంటర్వెల్ కు ముందు, ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలు రోమాలు నిక్కపొడుకునేలా తీశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. వాటికి ప్రాణం పోశారు మెగస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చే నొస్సం కోట అటాక్ సినిమాకే హైలైట్. సురేందర్ రెడ్డి విజన్, రత్నవేలు టేకింగ్, మెగస్టార్ స్క్రీన్ ప్రజెన్స్ కట్టిపడేస్తాయి. మూన్ లైట్ లో నొస్సం కోట సన్నివేశాన్ని చాలా అద్బుతంగా చిత్రీకరించారు. ఆ నొస్సం కోట అటాక్ సీన్ ఒక్కటి చాలు…సినిమాను హిట్ చేయడానికి అంటున్నారు ఇప్పటికే మూవీ చూసిన ప్రేక్షకులు.

ఇక క్లైమాక్స్ కి ముందు వచ్చే భారీ వార్ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. విజువల్స్ పరంగా ఆకట్టుకుంటుంది. ఆ వార్ లో 10 వేల మంది బ్రిటీష్ సైనికులు, 3వేల మంది నరసింహారెడ్డి సైన్యం మరణిస్తారు. సినిమా మొత్తానికి ఎక్కడా ఎమోషన్ మిస్ కాకుండా చాలా జాగర్త పడ్డాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.