భూకబ్జా మాఫియా నా భార్యను పొట్టనపెట్టుకుంది : ఎమ్మార్వో విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డి

తహశీల్దార్ కార్యాలయంలో సజీవదహనమైన ఎమ్మార్వో విజయారెడ్డి ఘటన తెలుగు రాష్ట్రాలను షాక్ కు గురిచేసింది. ఈ ఘటనతో విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డి కన్నీరు మున్నీరవుతున్నారు. ‘‘తన భార్యను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని, ఈ హత్య వెనకాల భూ కబ్జాదారులు ఉన్నార’’ని ఆరోపించారు సుభాష్ రెడ్డి. సీబీఐతో విచారణ జరిపి తన భార్య మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య ఆఫీస్ లో ఒత్తిడిని ఇంట్లో కనిపించనిచ్చేది కాదని గుర్తుచేసుకున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి బదిలీ కోసం చాలా ప్రయత్నించిందని… ట్రాన్స్ ఫర్ అయి ఉంటే బతికేదేమోనని ఆవేదన వ్యక్తం చేశారు.