పట్టాలివ్వలేదు, తగలబెట్టా : ఎమ్మార్వో సజీవదహనం, సురేష్ వాంగ్మూలం

అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు కూర సురేష్ ముదిరాజ్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. వివాదస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు తెలిపాడు. 60 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. ఎమ్మార్వోను ఎన్నో రోజులుగా, ఎంతగా బతిమిలాడినా ఆమె తనకు పట్టా ఇవ్వలేదని సురేష్ తెలిపాడు. సోమవారం మధ్యాహ్నం ఆమె కార్యాలయానికి వెళ్లి మరోసారి విజ్ఞప్తి చేసినా విజయారెడ్డి స్పందించలేదని తెలిపాడు. మొదట తనపై కిరోసిన్ పోసుకుని.. తర్వాత ఎమ్మార్వోపై పోసినట్లు వెల్లడించాడు. ముందు తనకు తానే నిప్పంటించుకుని తర్వాత విజయారెడ్డి తగులబెట్టినట్టు చెప్పాడు.