లోకేష్ తిండి ఖర్చు..!

మాజీ మంత్రి లోకేష్ అభాసుపాలైన సంఘటనలు ఎన్నో. ఆయనను ఎన్ని సార్లు చంద్రబాబు వెనకేసుకు వచ్చిన అనేక విషయాల్లో తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. లోకేష్ వల్లే పార్టీకీ నష్టం జరిగిన సందర్భాలు ఉన్నాయని పార్టీలో టాక్ కూడా ఉంది. ఇక సోషల్ మీడియాలో లోకేష్ బాబును ఓ ఆట ఆడుకున్న సందర్భాలు ఎన్నో చూశాం. అయితే తాజాగా లోకేష్ పై సోషల్ మీడియాలో మరోసారి సారి ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం అవినీతి చేసిందంటూ ఆరోపిస్తోంది. పోలవరం, విద్యుత్, రాజధాని అనేక విషయాల్లో

టీడీపీ ప్రభుత్వం అవినీతి చేసిందంటూ ఇప్పిటికే వైసీపీ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. గత ఐదేళ్లలో చేసిన అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా….

విశాఖ ఎయిర్ పోర్టులో లోకేష్ చేసిన స్నాక్స్ ఖర్చు! బయటకు వచ్చిందంటూ చర్చ జరుగుతోంది.
విశాఖ ఏయిర్ పోర్టులో లోకేష్ పేరిట ఖాతా తెరిచారట. ఆ ఖాతాలో స్నాక్స్ బిల్లు ఏకంగా పాతిక లక్షల రూపాయలనేది సంచలనంగా మారింది. దీంతో ఇప్పుడు వైరల్ గా మారింది. ఏకంగా పాతిక లక్షల రూపాయల విలువ జేసే స్నాక్స్ లోకేష్ పేరుతో వెళ్లాయని – వాటికి గత ప్రభుత్వ హయాంలో పదమూడు లక్షల రూపాయలుచెల్లించాలని – ఇప్పుడు ఇంకా పన్నెండు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ అధికారికంగా స్పందించడం లేదు!

దీంతో ఇపుడు మరోసారి లోకేష్ బాబు తిండి పై చర్చ జరుగుతోంది. పార్టీలోకి రాకమునుపు బయటిదేశాల్లో బీచ్ లో ఎంజాయ్ చేసినా ఫోటోలు బయటకు వచ్చి కొంత రచ్చ జరిగింది. ఇపుడు తాజాగా స్నాక్స్ బిల్లులపై చర్చ జరుగుతోంది. అయితే ఇదంతా కొంతమంది కావాలనే పుకార్లు పుట్టించి…చెడ్డ పేరు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తన్నారనేది టీడీపీ సింపతైజర్ల మాట. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే టీడీపీ నుంచి స్పందన రాలవాల్సిందే