రచ్చ రచ్చ : టీమిండియాలో గ్రూపు తగాదాలు, శాస్త్రిని సాగనంపుడే ఇగ

సెమీస్ ఓటమితో టీమిండియాలో లుకలుకలు మొదలయ్యాయి. సెమీస్ రేసు నుంచి తప్పుకున్న షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు క్రికెట్ ఇండియా. ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు ఇంకా చాలామందే. లీగ్ లో అంతా సవ్యంగా సాగుతున్నంత కాలం కనిపించని తప్పొప్పులు.. ఇపుడు భూతాలయ్యాయి. ఇండియన్ క్రికెట్ తీసుకోవాల్సిన చర్యలపై పోస్టుమార్టం చేస్తున్నారు క్రికెట్ లవర్స్. అటు టీంలోనూ అప్పుడే బైస్ స్టార్టయ్యాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిపై వేటు వేయాలన్నంత దూరం పోయింది పరిస్థితి. అంతేనా విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ చెరో క్యాంపు నడుపుతున్నారన్న పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ఓ వర్గం కోహ్లీని సపోర్ట్ చేస్తుంటే.. మరో వర్గం రోహిత్ కు మద్ధతిస్తోందట.

కెప్టెన్ కు, హెడ్ కోచ్  కు మధ్య సఖ్యత లేదన్న విషయం లెటెస్ట్ హాట్ టాపిక్. గతంలో అనిల్ కుంబ్లేతో విబేధించిన కోహ్లీ.. జంబోని సాగనంపే వరకు వదిలిపెట్టలేదు. కుంబ్లేని సాగనంపి రవిశాస్త్రిని ఎంపిక చేయడం వరకు కోహ్లీ చర్యలు గమనించే ఉంటారు. అయితే వరల్డ్ కప్ లో మాత్రం ఒకరికి తెలియకుండా మరొకరు నిర్ణయాలు తీసుకున్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. అదే జట్టులో అంతర్గత విబేధాలకు కారణమైందన్నది క్రీడాపండితుల విశ్లేషణ. రిషబ్ పంత్ ఔటయ్యాక రవిశాస్త్రి దగ్గరికెళ్లిన కోహ్లీ సీరియస్ అయిన సీన్స్ కనిపించాయి. అంబటి రాయుడును కాదని విజయ్ శంకర్ ని ఎంపిక చేయడమే కోహ్లీ కోపానికి కారణం అన్నది ఓ వాదన. అంబటి రాయుడు సెలెక్షన్ పై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. రెండేళ్లుగా నంబర్ ఫోర్ కోసం అతన్ని సెలెక్ట్ చేసి.. ఆడించి… స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా తీర్చిదిద్దాక మెగాటోర్నీకి అతన్ని తీసుకోకపోవడంపై దుమారం రేగుతోంది. గౌతమ్ గంభీర్ నుంచి సునీల్ గవాస్కర్ దాకా ప్రతీ ఒక్కరూ రాయుడును సెలెక్ట్ చేయకపోవడాన్ని తప్పుపట్టినవాళ్లే. సెలెక్షన్ కమిటీలో ఉన్నవాళ్ల స్కోరంతా కలిపితే రాయుడు స్కోరుకైనా సరిపోతారా అని గంభీర్ కాస్త ఘాటుగానే విమర్శించాడు. రాయుడును రానివ్వొదని మేనేజ్ మెంట్ బలంగా కోరుకుందట. నిజానికి రాయుడు కోసం కోహ్లీ గట్టిగానే ట్రై చేసినా… చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అతన్ని తప్పించాడంటారు. గతంలో ఇద్దరి మధ్య గొడవతో పాటు… క్యాస్ట్ ఈక్వెషన్ లో ప్రసాద్(కమ్మ) రాయుడు(కాపు)తో ఆడుకున్నాడన్న వాదనలున్నాయి.

ఇక కోహ్లీకి చీఫ్ ఆపరేషనల్ అసోసియేట్ వినోద్ రాయ్ అండదండలుండటం… టీం సెలెక్షన్లో విపరీతంగా జోక్యం చేసుకోవడం కెప్టెన్ నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించే సహాసం చేయకలపోయారట. కేఎల్ రాహుల్, చాహల్ విషయంలో కోహ్లీ జోక్యం మితిమీరిపోయిందన్న వాదనలున్నాయి. వాళ్ల పర్ ఫామెన్స్ ఎలా సాగిందో వరల్డ్ కప్ లో చూశాం. మొత్తమ్మీద కోహ్లీ సేనకు, బోర్డు పెద్దలకు నాకౌట్ దెబ్బ గట్టిగానే తగిలిందంటున్నారు. క్రికెట్ కు ఫ్యూచర్ ఉండాలంటే ప్రక్షాళన తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇమ్మిడియెట్ గా రవిశాస్త్రిని తప్పించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోందని గుసగుస.

LEAVE A REPLY