Motorola : మోటోరోలా నుంచి పవర్‌ఫుల్ ఫోన్ వచ్చేసింది .. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజులు పక్కా!

Motorola Edge 70 Fusion price in India

Motorola :  స్మార్ట్‌ఫోన్ ప్రియులకు మోటోరోలా అదిరిపోయే శుభవార్త చెప్పింది. తన పాపులర్ ఎడ్జ్ సిరీస్‌లో సరికొత్త ‘మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్’ ఫోన్‌ను శుక్రవారం ఇండియాలో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ ఫోన్ కేవలం చూడటానికే కాదు, పర్ఫార్మెన్స్‌లో కూడా రాజీ లేకుండా సరికొత్త ఫీచర్లతో వచ్చింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 6.78 ఇంచుల సూపర్ హెచ్‌డీ 1.5K అమోలెడ్ డిస్ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుండటంతో గేమింగ్ లేదా వీడియోలు చూసేటప్పుడు విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ వల్ల స్క్రీన్‌కు మరింత భద్రత లభిస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే, మోటోరోలా ఈసారి క్వాలిటీపై బాగా ఫోకస్ చేసింది. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ సోనీ LYTIA 710 ప్రైమరీ సెన్సార్‌ను అమర్చారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండటం వల్ల ఫోటోలు, వీడియోలు షేక్ అవ్వకుండా చాలా క్లియర్‌గా వస్తాయి. దీనితో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంది, ఇది మాక్రో ఫోటోగ్రఫీకి కూడా ఉపయోగపడుతుంది. సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ‘హలో యూఐ’తో నడిచే ఈ ఫోన్‌కు మూడు ఏళ్ల వరకు ఓఎస్ అప్‌డేట్స్, ఐదేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ మాటిచ్చింది.

193 గ్రాముల బరువు మాత్రమే

ఈ ఫోన్‌లోని మరో మేజర్ హైలైట్ దీని భారీ 7000mAh బ్యాటరీ. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ కేవలం 193 గ్రాముల బరువు మాత్రమే ఉండటం విశేషం. దీనికి 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్స్ మాత్రమే కాకుండా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా దీనికి ఉంది. అంటే కఠినమైన పరిస్థితుల్లో కూడా ఈ ఫోన్ చెక్కుచెదరదు. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్ స్పీకర్లు, 5G కనెక్టివిటీ వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ధర విషయానికి వస్తే, 8GB/128GB వేరియంట్ ధర ₹26,999 గా ఉంది. అలాగే 8GB/256GB వేరియంట్ ₹29,999 కి, 12GB/256GB వేరియంట్ ₹32,999 కి లభిస్తాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ₹2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు, లేదా ₹2,000 ఎక్స్ఛేంజ్ బోనస్ తీసుకోవచ్చు. దీంతో ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర కేవలం ₹24,999 నుండే మొదలవుతుంది. ఈ ఫోన్ పాంటోన్ బ్లూ సర్ఫ్, కంట్రీ ఎయిర్, సిల్హౌట్ కలర్లలో అందుబాటులో ఉంది. మార్చి 6న మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ఎర్లీ సేల్ ఉండగా, మార్చి 12 నుండి ఓపెన్ సేల్ ప్రారంభం కానుంది.