Oppo K14 5G : ఒప్పో నుంచి కొత్త బాహుబలి! మార్చి 9న లాంచ్.. ధర ఎంతంటే?

Oppo K14 5G

Oppo K14 5G :  స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు ఒప్పో (Oppo) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తన పాపులర్ K-సిరీస్‌లో సరికొత్త ‘Oppo K14 5G’ ని భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నెలలోనే వచ్చిన K14x మోడల్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఇది వస్తోంది. మరి ఈ ఫోన్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఎప్పుడు కొనుగోలు చేయవచ్చు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రోజంతా వాడినా తగ్గదు!

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీనే. ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీతో ఇది వస్తోంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు హ్యాపీగా వాడుకోవచ్చు. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. గతంలో వచ్చిన K14x లో 6,500mAh బ్యాటరీ ఉండగా, ఇప్పుడు దాన్ని మరింత పెంచడం విశేషం.

డిజైన్, కలర్స్:

డిజైన్ పరంగా K14 5G చూడటానికి K14x లాగే ఉన్నప్పటికీ, వెనుక వైపు కెమెరా మాడ్యూల్‌ను స్క్వేర్ షేప్‌లో కొంచెం స్టైలిష్‌గా మార్చారు. ఇది మెరిసే పర్పు్‌ల్ , క్లాసిక్ వైట్ కలర్ ఆప్షన్లలో లభించనుంది.

ఒప్పో K14 5G మార్చి 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. లాంచ్ అయిన వెంటనే ప్రముఖ ఈ-కామర్స్ సైట్ Flipkart లో ఇది అందుబాటులోకి వస్తుంది. ఇక ధర విషయానికి వస్తే, K14x ప్రారంభ ధర ₹14,999 గా ఉంది. K14 5G లో ఫీచర్లు కొంచెం ప్రీమియం‌గా ఉన్నాయి కాబట్టి, దీని ధర ₹16,000 నుంచి ₹18,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది.

తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, 5G కనెక్టివిటీ కోరుకునే వారికి ఈ ఫోన్ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మరిన్ని ఫీచర్లు లాంచ్ రోజున వెల్లడికానున్నాయి.

క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి 5 ఈజీ టిప్స్ మీ లివర్ డేంజర్‌లో ఉందని చెప్పే 7 లక్షణాలు! బాడీలో నీళ్లు తగ్గాయని చెప్పే 7 వార్నింగ్స్ సంక్రాంతి పుంజులు ‘అఖండ-2’: టికెట్ రేట్లు పెంపు సమంత, రాజ్‌ ఆస్తులెంత? దసరా భామలు సీడ్ సైక్లింగ్‌ ఎలా చేయాలంటే? ఏ చర్మానికి ఏ ఫేస్‌వాష్ వాడాలో తెలుసా? కాళ్లకు పసుపు ఎందుకు రాస్తారంటే..