Update Aadhaar : ఇక ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగక్కర్లేదు! ఇంట్లోనే కూర్చుని మీ మొబైల్ నంబర్ మార్చుకోండిలా..

Update Aadhaar

Update Aadhaar : ఆధార్ కార్డులో ఏ చిన్న తప్పు ఉన్నా, లేదా మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయాలన్నా గతంలో ఆధార్ సెంటర్ల దగ్గర గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ తిప్పలు తప్పనున్నాయి. ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (UIDAI) కొత్తగా ప్రవేశపెట్టిన ఆధార్ యాప్ ద్వారా, మనం ఎక్కడికీ వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది.

నేడు ప్రభుత్వ ఉద్యోగాలు, రేషన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, సబ్సిడీలు.. ఇలా ఏ సేవ పొందాలన్నా ఆధార్ ఓటీపీ (OTP) తప్పనిసరి. పాత నంబర్ పోయినా లేదా కొత్త నంబర్ మార్చుకున్నా, ఆధార్‌లో అది అప్‌డేట్ కాకపోతే మీ పనులు ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే ఈ కొత్త యాప్ ద్వారా సులభంగా నంబర్ మార్చుకునే వెసులుబాటు కలిగింది.

అప్‌డేట్ చేయడం ఎలా? (స్టెప్ బై స్టెప్):

  • మొదట గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి అధికారిక Aadhaar App డౌన్లోడ్ చేసుకోండి.
  • మీ ఆధార్ వివరాలతో లాగిన్ అయ్యాక, కింద ఉన్న ‘Services’ సెక్షన్‌కు వెళ్ళండి.
  • అక్కడ Update Mobile Number అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
  • మీరు మార్చుకోవాలనుకుంటున్న కొత్త మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే, దానికి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని వెరిఫై చేయండి.
  • ఆ తర్వాత అత్యంత ముఖ్యమైన స్టెప్.. Face Authentication. అంటే ఫోన్ కెమెరా ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చేయాలి. ఇది మీరు మాత్రమే నంబర్ మారుస్తున్నారని నిర్ధారించుకోవడానికి UIDAI పెట్టిన సెక్యూరిటీ ఫీచర్.
  • అంతా పూర్తయ్యాక ₹75 సర్వీస్ ఛార్జీని ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

ఎన్ని రోజుల్లో అప్‌డేట్ అవుతుంది?

మీరు రిక్వెస్ట్ పెట్టిన తర్వాత దాదాపు 15 రోజుల్లో ఆధార్ డేటాబేస్‌లో మీ కొత్త నంబర్ అప్‌డేట్ అవుతుంది. దీని స్టేటస్‌ను మీరు అదే యాప్‌లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇక మీదట చిన్న పనికి కూడా ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి, ఇది సామాన్యులకు పెద్ద ఉపశమనం అని చెప్పాలి.

క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి 5 ఈజీ టిప్స్ మీ లివర్ డేంజర్‌లో ఉందని చెప్పే 7 లక్షణాలు! బాడీలో నీళ్లు తగ్గాయని చెప్పే 7 వార్నింగ్స్ సంక్రాంతి పుంజులు ‘అఖండ-2’: టికెట్ రేట్లు పెంపు సమంత, రాజ్‌ ఆస్తులెంత? దసరా భామలు సీడ్ సైక్లింగ్‌ ఎలా చేయాలంటే? ఏ చర్మానికి ఏ ఫేస్‌వాష్ వాడాలో తెలుసా? కాళ్లకు పసుపు ఎందుకు రాస్తారంటే..