TV Remote Color Buttons : మనం ప్రతిరోజూ టీవీ చూస్తుంటాం కానీ, రిమోట్‌పై ఉండే ఆ ఎరుపు, పచ్చ, పసుపు, నీలం రంగు బటన్లను మాత్రం అస్సలు పట్టించుకోము. అసలు అవి ఎందుకు ఉన్నాయో, వాటి వల్ల ఉపయోగాలు ఏంటో చాలా మందికి తెలియదు. నిజానికి ఈ కలర్ బటన్లను ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న టీవీ సేవలను సులభంగా వాడుకోవడానికి, డిజిటల్ వీడియో బ్రాడ్‌కాస్టింగ్ (DVB) సిస్టమ్‌ను కంట్రోల్ చేయడానికి తయారు చేశారు. ఏదైనా యాప్‌లోకి వెళ్లాలన్నా లేదా మెనూ సెట్టింగ్స్ మార్చాలన్నా.. పదే పదే వేరే బటన్లు నొక్కే పని లేకుండా, ఈ రంగుల బటన్లతో షార్ట్‌కట్‌గా ఆ పనులను పూర్తి చేయవచ్చు.
ముఖ్యంగా పచ్చ రంగు బటన్ టీవీలో ప్రసారమయ్యే ప్రోగ్రామ్‌లను చూడటానికి, మెనూలో ఒక నిర్దిష్ట ఆప్షన్‌ను ఎంచుకోవడానికి లేదా కొత్త యాప్‌లను ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కొన్ని టీవీల్లో టీవీ గైడ్ చూస్తున్నప్పుడు రిమైండర్ సెట్ చేసుకోవడానికి కూడా ఇది పనికొస్తుంది. అలాగే పసుపు రంగు బటన్ సాధారణంగా అదనపు ఆప్షన్ల కోసం లేదా సెట్టింగ్స్‌లోకి వెళ్లడానికి వాడుతుంటారు.
దీని ద్వారా సబ్ టైటిల్స్ మార్చుకోవడం, భాషను మార్చడం లేదా ప్రోగ్రామ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడం వంటివి చేయవచ్చు. ఇక నీలం రంగు బటన్ విషయానికి వస్తే, ఇది హెల్ప్ మెనూ ఓపెన్ చేయడానికి లేదా ఇంటర్నెట్ ఆప్షన్లను వేగంగా ఎంచుకోవడానికి ఒక షార్ట్‌కట్‌లా పనిచేస్తుంది.
అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నా చాలా మంది వీటిని వాడకపోవడానికి ప్రధాన కారణం అవగాహన లేకపోవడమే. ఒక్కో టీవీ కంపెనీ ఒక్కో సెట్ ట్యాప్ బాక్స్‌లో ఈ బటన్ల పనితీరు వేర్వేరుగా ఉంటుంది. కొన్ని పాత టీవీ మోడల్స్ ఈ ఫీచర్లను సపోర్ట్ చేయకపోవడం వల్ల కూడా వీటి వాడకం తగ్గిపోయింది. మీ రిమోట్‌లోని ఈ బటన్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం వల్ల టీవీ చూడటం మరింత సులభమవుతుంది.
