శ్రీ అత్తి వరదరాజ పేరుమాళ్ సేవలో కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కంచి పర్యటనలో భాగంగా నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి సతీసమేతంగా వెళ్ళారు. తన ఇంటికి వచ్చిన కేసీఆర్ దంపతులను శాలువాతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు రోజా. అంతకు ముందు కేసీఆర్ వెంట రోజా కాంచీపురం వెళ్లారు. కంచిలో కేసీఆర్ దంపుతులు అత్తివరదరాజ స్వామి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో నగరిలో రోజా ఇంటికి వెళ్ళారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఉదయం రేణిగుంటకు విమానంలో చేరుకున్నారు. అక్కడ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు పలువురు ప్రముఖులు స్వాగతం పలికారు. రేణిగుంట నుంచి రోడ్డు మార్గాన కేసీఆర్ కాంచీపురం వెళ్లారు. ముందుగా అనుకున్నట్టు కాంచీపురం వెళుతూ నగరిలో ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లాలి…కానీ సమయాభావంతో నగరీలో రోజాను కలిసి కంచికి వెళ్లారు. అక్కడి నుంచి రేణిగుంట చేరుకుని విమానంలో హైదరాబాద్ వచ్చారు. సీఎం కేసీఆర్ కు ఏపీలో వైసీపీ నేతలు అన్ని దగ్గరుండి చూసుకున్నారు. కేసీఆర్ వెళుతున్న దారుల్లో ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. దైవభక్తి ఎక్కువ ఉండే కేసీఆర్ అత్తివరదరాజ పెరుమాళ్ స్వామిని మొదటి సారి దర్శించుకున్నారు.  అత్తివరదరాజ స్వామి 40ఏళ్లకోసారి 40రోజులు దర్శనమిస్తుంటారు. స్వామి దర్శనం కోసం భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తారు. చాల మంది భక్తులకు జీవితంలో ఒకసారి మాత్రమే దర్శించుకుంటే చాలనుకుంటారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయం కాబట్టి భక్తులు లక్షల్లో స్వామిని దర్శించుకునేందుకు వస్తుంటారు.

 

LEAVE A REPLY