BREAKING:ఆర్టీసీలో 1,743 పోస్టులు.. నోటిఫికేషన్‌ రిలీజ్!

Telangana : తెలంగాణలో నిరుద్యోగులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆర్టీసీలో డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్‌ నియామక మండలి కొద్దీసేపటి క్రితమే నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. ఇందులో మొత్తంగా 1000 డ్రైవర్‌, 743 శ్రామిక్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా ఆర్టీసీ వెల్లడించింది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థుల నుంచి 2025 అక్టోబర్‌ 8 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను https://www.tgprb.in/ వెబ్‌సైట్‌లో చూడండి.