Telangana : ఈ ఏడాది బీటెక్ కంప్లీట్ చేసింది. అంతేకాకుండా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మంచి జాబ్ కూడా కొట్టేసింది. కానీ ఆ జాబ్ వద్దనుకుని సర్పంచి పదవి కోసం, పుట్టిన ఊరి కోసం పోరులో నిలిచింది..గెలిచింది. 21 ఏళ్లకే సర్పంచ్ అయింది. నల్గొండ జిల్లా కనగల్ మండలం ఇస్లాంనగర్ గ్రామంలో చోటు చేసుకుంది.
బోయపల్లి అనూష బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేసి 182 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించింది. చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తే గ్రామాలు బాగుపడతాయని అనూష చెబుతోంది. యువత రాజకీయాల్లోకి వస్తేనే మార్పు వస్తుందని ఆమె ఆకాంక్షించారు.తనను గెలపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. .
మరోవైపు సొంత గ్రామంలో భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ పార్టీ నేత మడకం జోగయ్య 84 ఓట్ల తేడాతో గెలిచారు. అటు మంత్రి సీతక్క సొంత జిల్లా ములుగు మేజర్ గ్రామ పంచాయతీ ఏటూరునాగారంలో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాకులమర్రి శ్రీలత ఏకంగా 3,230 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఈ గ్రామంలో మొత్తం 8 వేల 333 ఓట్లు నమోదవ్వగా, 5,520 ఓట్లు బీఆర్‌ఎస్ అభ్యర్థి్కి రావడం విశేషం. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ గ్రామంలో మంత్రి సీతక సర్పంచ్ ఎన్నికల కోసం ఐదుసార్లు ప్రచారం చేసినా ప్రజలు ఆమెను నమ్మలేకపోయారు.
