Hyderabad: హనుమాన్ విగ్రహం ధ్వంసం!

Hyderabad

Hyderabad : మేడ్చల్‌ జిల్లాలో హనుమాన్ విగ్రహం ధ్వంసం అయింది. రాంపల్లిలో విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం ఎడమ చేయితో పాటుగా గద కూడా ధ్వంసం అయింది. నిందితులను అరెస్ట్ చేయాలని హిందూ సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. ఈ సంఘటనపై బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు స్పందించారు. ఈ మేరకు ఆయన వెళ్లి విగ్రహాన్ని పరిశీలించారు.

ధ్వంసం చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం విగ్రహం ధ్వంసం కాదు హిందూ విశ్వాసాలపై నేరుగా దాడి అని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ముత్యాలమ్మ ఆలయం, గణేష్ విగ్రహం, నవగ్రహ ఆలయం, భూలక్ష్మి ఆలయం, మాతాజీ ఆలయాలపై జరిగిన దాడులు హిందూ సమాజాన్ని కదిలించాయిని అన్నారు.

మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే దుండగులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలి. బాధ్యులపై కఠిన చర్యలు తప్పనిసరి అని హెచ్చరించారు. బీజేపీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, హిందూ దేవాలయాల రక్షణ కోసం నిరంతరం పోరాడుతుందని తెలిపారు.