Telangana : ఓర్ని దుంపతెగ.. ఇంట్లోనే గంజాయి చెట్టు పాతాడు!

achampet

Telangana : వ్యసనం మనిషిని ఎంతటి దారుణ నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందో చెప్పడానికి ఈ ఒక్క ఘటన ఉదాహరణగా మిగిలింది. మొదట్లో సరదాగా మొదలైన ఓ యువకుడికి గంజాయి అలవాటు కాగా కొద్దికాలంలోనే అతన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంది. రోజులు గడిచే కొద్దీ అతనికి ఆ గంజాయి లేకుండా గడపడం కష్టంగా మారింది.

దీంతో ప్రతిసారి కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా పోయాయి. అలా అని గంజాయి లేకుండా ఉండలేని పరిస్థితి. దీంతో అతనికో ఆలోచన వచ్చింది. ఎందుకు నేనే ఇంట్లోనే గంజాయి పెంచకూడదు అనుకున్నాడు. ఇంకేం ఎవరికీ తెలియకుండా తన ఇంటి లోనే సిక్రెట్ గా గంజాయి విత్తనాలు నాటాడు.Telangana :

ఆ గంజాయి మొక్కలు మెల్లగా పెరిగి తోటగా మారింది. అయితే ఇది కాస్త ఆ నోట ఈ నోట పోలీసులకు తెలియడంతో పోలీసులు వచ్చి తనిఖీ చేయగా అసలు విషయం బయట పడింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో సంచలనం సృష్టించింది.అచ్చంపేట మండలం, పల్కపల్లి గ్రామానికి చెందిన నాగనులు మధు అనే యువకుడు గంజాయికి తీవ్రంగా అలవాటు పడ్డాడు.

బయట దొరకడం కష్టంగా మారడంతో తెలివిగా తన ఇంటి లోనే రహస్యంగా గంజాయి మొక్కలను పెంచడం ప్రారంభించాడు. పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి గంజాయి మొక్కను స్వాధీనం చేసుకుని, మధును అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.