సొంత ఫ్రెండ్ కే బొమ్మ చూపించిన IBOMMA రవి!

ibomma

IBOMMA : సినిమా పైరసీ కేసులో అరెస్టైన ఇమ్మడి రవి తన ఫ్రెండ్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. రవి తన రూమ్‌మేట్ అయిన ప్రహ్లాద్ వెల్లేల పేరుతో పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే పోలీసులు.. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రహ్లాద్‌ను హైదరాబాద్ కు పిలిపించి, రవి సమక్షంలోనే విచారించారు.

తన పేరుతో రవి డాక్యుమెంట్లు తీసుకున్న విషయం తెలిసి ప్రహ్లాద్ షాక్‌కు గురయ్యాడు. తన పేరుతో రవి నకిలీ పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నట్టు తనకు తెలియదన్నాడు. ఇమ్మడి రవికి కోర్టు విధించిన తాజా పోలీసు కస్టడీ రేపటితో (డిసెంబర్ 29) ముగియనుంది. గత నెలలో ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ వచ్చిన రవిని పోలీసులు కూకట్‌పల్లిలో అరెస్ట్ చేశారు.

రవి ప్రస్తుతం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వం కలిగి ఉన్నాడు. పైరసీ ద్వారా రవి దాదాపు ₹20 కోట్లు సంపాదించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అతని బ్యాంక్ ఖాతాల్లోని ₹3.5 కోట్లను ఫ్రీజ్ చేశారు.ఈ కేసులో భారీగా మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా దర్యాప్తు ప్రారంభించింది. క్రిప్టో కరెన్సీ ద్వారా విదేశాలకు నగదు మళ్లించినట్లు ఆధారాలు సేకరిస్తున్నారు.