Jagtial : వచ్చిన పెళ్లి సంబంధాలు చెడగొట్టడంతో పాటుగా ఫోన్‌లోని ప్రైవేటు వీడియోలు చూపుతూ తమను బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని అక్కాచెల్లెళ్లు ఓ యువకుడిని హత్య చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్(32) అనే వ్యక్తి హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా జాబ్ చేస్తున్నాడు. అయితే మాదాపూర్ లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న ఓ యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ఇది కాస్త అక్రమసంబంధానికి దారి తీసింది. అంతటితో ఆగని మహేందర్ .. ఆ యువతి అక్కతోనూ పరిచయం పెంచుకుని ఆమెతోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
అయితే ఇటీవల ఆ యువతికి ఓ పెళ్లి సంబంధం రాగా మహేందర్ అడ్డుపడ్డాడు. తన ఫోన్‌లో ఆమెతో ఉన్న అసభ్యకర వీడియోలను చూపి చెడిపోయేలా చేశాడు . దీంతో బ్లాక్ మెయిల్ చేస్తున్న మహేందర్‌పై అక్కాచెల్లెళ్లు పగ పెంచుకున్నారు. చంపేయాలని ఫిక్స్ అయ్యారు.
ప్లాన్ లో భాగంగా.. మహేందర్‌కు ఫోన్ చేసి తన అక్క గ్రామానికి రమ్మని చెప్పగా వెళ్లాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో అక్కాచెల్లెళ్లు మహేందర్‌తో గొడవకు దిగారు. అనుకున్న ప్లాన్ ప్రకారం కళ్లలో కారం చల్లి కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న అక్క కుమారుడు, బంధువు, మరో వ్యక్తి కర్రలతో తీవ్రంగా కొట్టారు.
తలకు తీవ్ర గాయాలతో మహేందర్ రక్తం మడుగులో పడిపోయాడు. స్థానికులు వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
