Warangal :జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు బలిచ్చారు. కాటారం – భూపాలపల్లి అటవీ ప్రాంతంలో యువతి మృతదేహం లభ్యమైంది. బాధితురాలని చిట్యాల మండలం ఒడితలకు చెందిన కప్పల వర్షిణిగా గుర్తించారు. ఘటనా స్థలంలో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు.
క్షుద్రపూజలు చేసి బలిచ్చారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. డెడ్‌బాడీ పక్కన ఆధార్ కార్డు లభ్యం అయింది. ఆధార్ కార్డు ఆధారంగా వర్షిణిగా గుర్తించారు. కాగా ఈ నెల 6న చిట్యాల స్టేషన్‌లో వర్షిణి మిస్సింగ్ కేసు నమోదు అయింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
ఒడితెలా గ్రామానికి చెందిన కప్పల వర్షినికి 22 ఏళ్లు ఇంట్లో నుంచి ఈ నెల 6వ తేదీన బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపడుతుండగా.. ఆ ప్రాంతంలో వెళుతున్న పశువుల కాపర్లు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అసలు ఆయువతి ఈ అటవీ ప్రాంతంలోకి ఎందుకు, ఎలా వచ్చింది అనే అనుమానం నెలకొంది.