Akbaruddin Owaisi: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశలో ఎంఐఎం (MIM) కీలక నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. కరీంనగర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ ప్రాధాన్యతను వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నేరుగా సవాల్ విసిరారు.
తమ పార్టీ ఎవరి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రులే తమ దగ్గరకు రావాల్సిన పరిస్థితి ఉంటుందని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ వంటి కీలక నియోజకవర్గాల్లో ఎంఐఎం మద్దతు ఇవ్వబట్టే కాంగ్రెస్ విజయం సాధించిందా ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలించేది రెడ్డి అయినా, రావు అయినా సరే.. అధికారం కోసం మా దగ్గరకు రావాల్సిందే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం తన సత్తా ఏంటో చూపిస్తుందని, తమ బలం ఏంటో అందరికీ అర్థమయ్యేలా చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా మైనారిటీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తమ పార్టీ తిరుగులేని శక్తిగా నిలుస్తుందని అక్బరుద్దీన్ చెప్పుకొచ్చారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ద్వారా అటు కాంగ్రెస్‌కు, ఇటు ప్రతిపక్షాలకు ఆయన గట్టి హెచ్చరికలే పంపారు.
Also Read :
- Sri Ranga Sudha: తిరుపతి బ్యూటీ..కొత్త వెబ్ సిరీస్‌తో పిచ్చెక్కిస్తోంది!
- Kamalakar Bhat : జ్యోతిష్యం కోసం వెళ్తే ఉంచుకున్నాడు.. భక్తురాలితో గురూజీ రాసలీలలు
