BIG BREAKING : హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. సులేమాన్ నగర్‌లోని తన స్వంత కార్యాలయంలో ఉండగా, అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్‌పై గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. నిందితులు ఆయనను పలుమార్లు కత్తులతో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై ఖదీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పట్టపగలే కార్యాలయంలోకి చొరబడి జరిగిన ఈ హత్య స్థానికంగా పెను కలకలం సృష్టించింది.
BIG BREAKING : అత్తాపూర్‌లో దారుణం.. పట్టపగలే అడ్వకేట్ మర్డర్!
