Black Magic : ఓ మాజీ సర్పంచ్ పగలు రాజకీయ నేతగా బిజీగా చెలామణి అవుతూనే రాత్రి సమయంలో క్షుద్రపూజలు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నారపోగు నాగరాజు క్షుద్రపూజలు చేస్తూ అమాయక గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఈ మేరకు అన్నం రాసులపై మాంసం, రక్త తర్పణాలు చేస్తూ గాల్లోకి నిమ్మకాయను లేపాడు.
మాజీ సర్పంచ్ క్షుద్రపూజలు…వీడియో వైరల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. మాజీ సర్పంచ్ నారపోగు నాగరాజు క్షుద్రపూజలు చేస్తూ అమాయక గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు అన్నం రాసులపై మాంసం,… pic.twitter.com/rwoOjsuzkk
— ChotaNews App (@ChotaNewsApp) December 7, 2025
నారపోగు నాగరాజు డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతోనే ఈ క్షుద్రపూజలు, మూఢనమ్మకాలను గ్రామంలో వ్యాపింపజేస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పూజల కారణంగా గ్రామంలో అశాంతి నెలకొందని, అమాయక గిరిజనులు తీవ్ర భయానికి గురవుతున్నారని వారు తెలిపారు.
ఈ క్షుద్రపూజలకు పాల్పడి, గ్రామంలో భయాందోళనలు సృష్టిస్తున్న నాగరాజుపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, మూఢనమ్మకాలను అరికట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. నాగరాజు గతంలో కూడా ఫేక్ పాస్ పుస్తకాల కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చాడు.
