BIG BREAKING : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక్కరోజులోనే సీన్ మారిపోయింది. శుక్రవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు, సాయంత్రానికల్లా సీబీఐ గట్టి షాక్ ఇచ్చింది. తనను కేసు నుండి విముక్తి చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని దర్యాప్తు సంస్థ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.
సీబీఐ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు త్వరలోనే స్పందించనుంది.ఈ అప్పీల్‌పై మార్చి మొదటి వారంలో హైకోర్టులో విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని సీబీఐ గట్టిగా కోరే అవకాశం కనిపిస్తోంది.
ఒకవేళ హైకోర్టు గనుక సీబీఐ వాదనలతో ఏకీభవిస్తే, ఈ కేసులో ఆమె మళ్లీ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మార్చి నెలలో జరగబోయే ఈ హైకోర్టు విచారణ కవిత రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది.
క్లీన్ చీట్ ఇచ్చింది వీళ్లకే
1) కుల్దీప్ సింగ్
2) నరేందర్ సింగ్
3) విజయ్ నాయర్
4) అభిషేక్ బోయిన్‌పల్లి
5) అరుణ్ రామచంద్ర పిళ్ళై
6) మూత గౌతమ్
7) సమీర్ మహేంద్రు
8) మనీష్ సిసోడియా
9) అమన్‌దీప్ సింగ్ ధాల్
10) అర్జున్ పాండే
11) బుచ్చిబాబు గోరంట్ల
12) రాజేష్ జోషి
13) దామోదర్ ప్రసాద్ శర్మ
14) ప్రిన్స్ కుమార్
15) అరవింద్ కుమార్ సింగ్
16) చాన్‌ప్రీత్ సింగ్ రాయత్
17) కవిత కల్వకుంట్ల
18) అరవింద్ కేజ్రీవాల్
19) దుర్గేష్ పాఠక్
20) అమిత్ అరోరా
21) వినోద్ చౌహాన్
22) ఆశిష్ చంద్ మాథుర్
23) శరత్ చంద్ర రెడ్డి
