BIG BREAKING : ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా క్లీన్ చీట్ లభించిన తర్వాత ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి తననే కారణం అన్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా కేటీఆర్ చేసిన ట్వీట్లపై ఆమె ఘాటుగా స్పందించారు.
#WATCH | Hyderabad: Telangana Jagruthi President K Kavitha says, "I have 100 times said that we have nothing to do with this case. This is a politically motivated case. As a part of political vendetta, this case has been put on the Opposition parties and I am thankful to the… https://t.co/MxB0E6aNxJ pic.twitter.com/xDI21wkAGE
— ANI (@ANI) February 27, 2026
బీఆర్ఎస్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడానికి లిక్కర్ కేసే కారణమని ప్రచారం చేయడం సరికాదు. కేటీఆర్ కూడా అదే అర్థం వచ్చేలా ట్వీట్ చేయడం విచారకరం అని అన్నారు. కేటీఆర్ ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకోవడం పొరపాటు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
నాపై కేసు పెట్టింది వ్యక్తిగత కారణాల వల్ల కాదు, పార్టీ కోసమే కదా? మరి తప్పు తేలకముందే నా క్యారెక్టర్‌ను దెబ్బతీసేలా ప్రచారం జరుగుతుంటే పార్టీ ఎందుకు మౌనంగా ఉంది అని కవిత నిలదీశారు. నేను ఏ తప్పూ చేయకపోయినా ఏడాది కాలంగా నరకం అనుభవించాను. అప్పుడు మాట్లాడకుండా, ఇప్పుడు ఓటమిని నాపై రుద్దాలని చూస్తే ప్రజలు ఊరుకోరని కవిత చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒకటేనని ఆమె విమర్శించారు. అందుకే వచ్చే రెండు నెలల్లోనే తాను కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
