BIG BREAKING : కవిత కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు!

kavitha

BIG BREAKING : తెలంగాణ రాజకీయాల్లో మరో పెను సంచలనం నమోదు కాబోతోంది. ఎమ్మెల్సీ కవిత (తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు) తన రాజకీయ భవిష్యత్తుపై అత్యంత కీలక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న కొత్త పార్టీ అంశంపై ఆమె క్లారిటీ ఇచ్చారు.

మార్చి 27న శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, తన మెట్టినిల్లు అయిన నిజామాబాద్ వేదికగా కవిత ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 8:30 గంటలకు జరిగే ఈ సమావేశంలో కొత్త పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను ఆమె వెల్లడించనున్నారు.

ఆమె తన కొత్త పార్టీ పేరు తెలంగాణ జన జాగృతి పార్టీగా పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్ ద్వారా పార్టీ జెండా, గుర్తు, పార్టీ అనుసరించబోయే సిద్ధాంతాలను వివరించే అవకాశం ఉంది.

పార్టీ ప్రకటన మార్చి 27న జరిగినప్పటికీ, అసలైన శక్తి ప్రదర్శన మాత్రం ఏప్రిల్ 25న ఉండబోతోంది. మేడ్చల్ వేదికగా సుమారు లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభ ద్వారా అధికారికంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు జాతీయ స్థాయి నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.