BIG BREAKING : రాజకీయాలకు కడియం శ్రీహరి గుడ్ బై !

BIG BREAKING : మాజీ మంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానని, తాను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. ఇవి నా చివరి ఎన్నికలు అని అసెంబ్లీ ఎన్నికలకు ముందే తాను చెప్పానని, ఇప్పుడు కూడా చెబుతున్నాను.. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయన్నారు. చిలిపి చేష్టలు లేవు, చిల్లర పనులు చేయను.. తప్పు చేయను తలవంచనన్నారు. ఎక్కడికైనా వెళ్తే నాటుకోడి కూర, బ్లాక్ లేబుల్ మందు అడుగనన్నారు. మిగిలిన భోజనం టిఫిన్ లో పెట్టుకొని తీసుకుపోనంటూ అంటూ తాటికొండ రాజయ్యపై పరోక్షంగా సెటైర్లు వేశారు కడియం.

బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పంపిన నేపథ్యంలో కడియం శ్రీహరి వాటిపై స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి సహకారం వల్లే అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు.

కాగా కడియం శ్రీహరి పార్టీ మారడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు, స్థానిక ప్రజలు నియోజకవర్గంలో రాజీనామా చేయాలంటూ పోస్ట్ కార్డుల ఉద్యమం ప్రారంభించారు. ఓటు వేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.