‘ల..జగూడ’.. అధ్యక్షా ఊరు పేరు మార్చండి.. MLA డిమాండ్!

mla

MLA :  పలకడానికి ఇబ్బందికరంగా, వినడానికి అసభ్యకరంగా ఉన్న ఒక గ్రామ పేరును వెంటనే మార్చాలని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగజ్ నగర్ మండల పరిధిలో ఉన్న ‘ల..జగూడ’ (Lanjaguda) అనే గ్రామం పేరు ఉచ్చరించడానికి గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు.

ఈ పేరు వల్ల పడుతున్న అవమానాన్ని భరించలేక గ్రామస్తులు ఇప్పటికే తమ గ్రామాన్ని నందిగూడగా పిలుచుకుంటున్నారని, గ్రామ పంచాయతీలో కూడా తీర్మానం చేసుకున్నారని తెలిపారు. గ్రామస్తులు పేరు మార్చుకున్నప్పటికీ, ప్రభుత్వ రికార్డుల్లో మరియు రెవెన్యూ పత్రాల్లో ఇంకా పాత పేరే కొనసాగుతోందని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

దీనివల్ల ధ్రువీకరణ పత్రాలు పొందేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రెవెన్యూ రికార్డుల్లో గ్రామం పేరును అధికారికంగా నందిగూడగా మార్చాలని ఆయన అసెంబ్లీ సాక్షిగా కోరారు.

కాగా 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని కాగజ్‌నగర్‌ మండలంలో మండలంలో ఉండేది.

క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి 5 ఈజీ టిప్స్ మీ లివర్ డేంజర్‌లో ఉందని చెప్పే 7 లక్షణాలు! బాడీలో నీళ్లు తగ్గాయని చెప్పే 7 వార్నింగ్స్ సంక్రాంతి పుంజులు ‘అఖండ-2’: టికెట్ రేట్లు పెంపు సమంత, రాజ్‌ ఆస్తులెంత? దసరా భామలు సీడ్ సైక్లింగ్‌ ఎలా చేయాలంటే? ఏ చర్మానికి ఏ ఫేస్‌వాష్ వాడాలో తెలుసా? కాళ్లకు పసుపు ఎందుకు రాస్తారంటే..