BJP అభ్యర్థిగా బొంతు రామ్మోహన్.. ఇదిదా ట్విస్ట్!

BJP : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. త్వరలో ఎలక్షన్ కూడా జరుగనుంది. ఇప్పటికే కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఈ క్రమంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ ఉండే అవకాశం ఉంది. బొంతు రామ్మోహన్ పేరును పార్టీ ముందు ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ రామచందర్‌ రావు, BJLP నేత మహేశ్వర్‌ రెడ్డికి అర్వింద్ చెప్పినట్లుగా పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది.

బొంతు రామ్మోహన్ మనవాడు, ABVPలో పని చేసిన వ్యక్తి అని, టికెట్ ఇస్తే బాగుంటుందని తెలిపినట్లుగా జోరుగా ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న బొంతు రామ్మోహన్… కాంగ్రెస్‌ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి వెనక్కి తగ్గారు. తాను పోటీలో లేనన చెప్పిన బొంతు రామ్మోహన్ బీజేపీ నుంచి పోటీలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.

ఏబీవీతో విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన బొంతు రామ్మోహన్.. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆయనకు జీహెచ్ఎంసీ మేయర్ గా అవకాశం కల్పించింది టీఆర్ఎస్. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో  ఉప్పల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన రామ్మోహన్ టికెట్ ఆశించారు. బీఆర్ఎస్ పార్టీ ఆ ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. దీంతో  గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.

నవంబర్ 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనుంది. జూబ్లీహిల్స్‌లో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, వీరిలో దాదాపు 1.20 లక్షల మంది ముస్లింలు, మరో 22,000 మంది ఇతర మైనారిటీ వర్గాలకు చెందినవారు..

Also Read :