Excise policy case : ఒక్క ఫాల్తు కేసు… రెండు పార్టీలు ఖతం!

kavitha

Excise policy case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ చుట్టూ తిరిగిన రాజకీయ చదరంగంలో ఇప్పుడు అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి. ఇన్నాళ్లూ సంచలనం సృష్టించిన సీబీఐ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఎమ్మెల్సీ కవితకు పెద్ద ఊరట లభించింది.

కవితతో పాటు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా 23 మందికి ఈ కేసులో ఊరట దక్కింది. అయితే ఈడీ కేసులో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

ఈ ఒక్క కేసు దేశ రాజకీయ గమనాన్నే మార్చేసింది. ఈ విచారణల కారణంగానే అటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇటు తెలంగాణలో కూడా దీని ప్రభావం గట్టిగానే పడింది. కవిత అరెస్ట్ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. ఇదే అదనుగా భావించిన బీజేపీ.. తెలంగాణలో ఏకంగా 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని బలోపేతమైంది.


కేసుల గోల ఒకవైపు ఉంటే.. కవిత సొంత కుటుంబంలో విభేదాలు బయటపడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. జైలులో ఉన్న సమయంలో అన్న కేటీఆర్ తనకు ఆశించిన స్థాయిలో సహకరించలేదని కవిత బహిరంగంగానే కామెంట్ చేశారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆమె..కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు.

 ఒకే దెబ్బకు రెండు పిట్టలు

విపక్ష నేతలను కేసుల్లో ఇరికించడం ద్వారా తెలంగాణ, ఢిల్లీలో అధికారాన్ని  సాధించడంలో కమలం పార్టీ సక్సెస్ అయింది. ఇన్నాళ్లూ జైలు శిక్ష అనుభవించిన నేతలకు ఇప్పుడు క్లీన్ చిట్ రావడంతో.. అది ఫేక్ కేసా అనే అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. ఒక చిన్న కేసు ఇద్దరు కీలక నేతల కెరీర్‌ను, రెండు పార్టీల భవిష్యత్తును తలకిందులు చేసింది.