BRS : కూకట్‌పల్లిలో ఎమ్మెల్సీ కవిత తనపై చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కవిత వ్యాఖ్యలపై స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. కవితకు హైదరాబాద్ ఎమ్మెల్యేలపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, ఆమెకు తమ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
ఇక ఆయన ఏకంగా వ్యక్తిగత విమర్శలు చేశారు. “తెలంగాణ చరిత్రలో లిక్కర్ చరిత్ర నీది. నీ చరిత్ర ఏంటో, నీ బతుకు ఏంటో మాకు తెలుసు. నీ ఇంట్లో కుక్క పేరు కూడా విస్కీ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము తెలంగాణ కోసం పనిచేశామని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం హైదరాబాద్ ఎమ్మెల్యేలు కలిసి నడిస్తే తమను ‘బీ.టీ బ్యాచ్’ (బ్లూ టెలిఫోన్ బ్యాచ్) అని కవిత అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవునపల్లి కవితపై సంచలన వ్యాఖ్యలు చేసిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
హరీశ్‌రావుపై లేని పోని నిందలు వేసి పార్టీ నుండి వెళ్ళగొట్టి… రేవంత్ రెడ్డితో కలిసి కేటీఆర్‌ను జైలులో వేసి.. తెలంగాణను దోచుకోవడానికి కవిత చూస్తోంది.
– #MadhavaramKrishnaRao pic.twitter.com/9kWO1jvgBB
— Telangana First (@TelanganaFirst_) December 9, 2025
కవిత కుటుంబంపై భూకబ్జాలకు పాల్పడ్డారంటూ మాధవరం కృష్ణారావు కీలక ఆరోపణలు చేశారు. “కవిత మొగుడి కబ్జాల చిట్టా నా దగ్గర ఉంది. ఓవర్‌ల్యాప్ ల్యాండ్లను నువ్వు కేసీఆర్ పేరు చెప్పుకొని క్లియర్ చేసుకున్నావు. ఏ బంగారం షాపునూ వదల్లేదు. నీ బండారం బయటపెడితే తట్టుకోలేవు” అని హెచ్చరించారు. నేను నీ వ్యక్తిగతం గురించి మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు. జాగ్రత్తగా మాట్లాడు. నీ చిట్టా నా దగ్గర ఉంది. పెద్ద ఆయన (కేసీఆర్) కోసం ఊరుకొంటున్నాను” అని మర్యాదగా చెప్తున్నట్లు మాధవరం పేర్కొన్నారు.
తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. నీలాంటి కుక్కలు చాలామంది ఇక్కడికి వచ్చి మొరిగిపోయారు అని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ పై అభిమానంతోనే తమ ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదని, ఇంకోసారి తమ పార్టీపైన, ఎమ్మెల్యేలపైన మాట్లాడితే ఊరుకోనని హెచ్చరించారు. హరీష్ రావును పార్టీ నుండి వెళ్లగొట్టాలి, కేటీఆర్‌ను అరెస్టు చేపించాలి, దోచుక తినాలి అన్నదే కవిత ప్లాన్ అని ఆరోపించారు.
బీసీ వాదంపై కూడా కవితను మాధవరం విమర్శించారు. పదేళ్లు అధికారంలో పదవులు అనుభవించి, ఇప్పుడు ఎన్నికలు లేని సమయంలో బీసీ వాదం ఎత్తుకున్నారని అన్నారు. ప్రస్తుతం కవిత ఉంటున్న ఇల్లు సీఎం రేవంత్ రెడ్డికి కూడా అంత పెద్ద ఇల్లు లేదన్నారు. కూకట్పల్లి అభివృద్ధి గురించి మాట్లాడుతూ, ట్రక్ పార్కు గురించి, కేపీహెచ్బీలో సొంత నిధులతో నిర్మిస్తున్న స్కూల్ గురించి కవితకు ఏం తెలుసని ప్రశ్నించారు.మేము ఉద్యమం చేశామని ఎప్పుడూ చెప్పుకోలేదు. హైదరాబాద్ ప్రజలను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసని మాధవరం అన్నారు.
