BIG BREAKING : మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌పై జరిగిన పోలీసుల దాడి, డ్రగ్స్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై భారత్ రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ చర్యను సహించబోమని స్పష్టం చేస్తూ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
మీడియాలో వస్తున్న ఆరోపణలపై 7 రోజుల్లోగా స్పష్టమైన లిఖితపూర్వక వివరణ సమర్పించాలని ఆదేశించారు. ఒకవేళ గడువులోపు వివరణ ఇవ్వకపోయినా లేదా సమాధానం సంతృప్తికరంగా లేకపోయినా పార్టీ నియమావళి ప్రకారం ఆయనను పార్టీ నుండి బహిష్కరించే అవకాశం ఉందని హెచ్చరించారు.
బ్రేకింగ్ న్యూస్
పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారం పై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాలపై చర్యలు తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ
మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసిన పార్టీ అధినేత కేసీఆర్
వారం రోజుల్లోగా… pic.twitter.com/w2RccbusRj
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2026
పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని, ముఖ్యంగా డ్రగ్స్ వంటి సామాజిక విపత్తులతో సంబంధం ఉన్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అధిష్టానం సంకేతాలు పంపింది. ఈ విషయంపై పార్టీ తుది నిర్ణయం తీసుకునే వరకు రోహిత్ రెడ్డి ఎటువంటి పార్టీ కార్యక్రమాల్లోనూ, అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనకూడదని స్పష్టం చేశారు.
శనివారం రాత్రి మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌పై పోలీసుల ప్రత్యేక బృందం EAGLE దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు, రోహిత్ రెడ్డికి నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో రోహిత్ రెడ్డి ప్రస్తుతం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్లో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. చూస్తుంటే పైలట్ రోహిత్ రెడ్డిపై KCR వేటు వేసే అవకాశం కనిపిస్తుంది.
