Hyderabad : హైదరాబాద్ లో దారుణం జరిగింది. మల్కాజిగిరిలోని జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో రియల్టర్ గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. స్కూటీపై వెళ్తున్న రియల్టర్ వెంకట రత్నంను దుండగులు వెంబడించి మరీ హత్య చేశారు.
సినిమా లెవల్ లో కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చారు. సాకేత్ కాలనీ ఫోస్టర్ స్కూల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసుల అనుమానిస్తున్నారు.
నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
