CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. చిట్‌చాట్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం.. కేసీఆర్ ఉండబట్టే తనకు ఇంత గుర్తింపు వచ్చిందని వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రస్థానాన్ని పురాణ గాథలతో పోలుస్తూ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లోకంలో రావణుడి చెడు ఉంది కాబట్టే, రాముడి గొప్పతనం అందరికీ తెలిసింది. అలాగే కేసీఆర్ పాలనలోని లోపాలు ఉన్నాయి కాబట్టే నేను చేస్తున్న మంచి పనులు జనాలకు అర్థమవుతున్నాయని ఆయన అన్నారు. మహాభారతంలో శకుని లేకపోతే కృష్ణుడి పాత్రకు అంత ప్రాధాన్యత ఉండేది కాదని, అలాగే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేరని చమత్కరించారు.
ప్రస్తుతం కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారని, కానీ తనకైతే వేరే అనుమానం ఉందని సీఎం పేర్కొన్నారు. కేసీఆర్‌ను గృహనిర్బంధం చేశారని నాకు అనిపిస్తోంది” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావుపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. హరీష్ రావు కాలనాగు కంటే ప్రమాదకారి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.
