BIG BREAKING : కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఔట్!

BIG BREAKING

BIG BREAKING : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మద్యం దుకాణాలపై తన నియోజకవర్గంలో కొత్త రూల్ తీసుకొచ్చారు రాజగోపాల్. సాయంత్రం 4నుంచి రాత్రి 9వరకే మద్యం దుకాణాలు తెరవాలని..పర్మిట్ రూమ్‌లు పెట్టొద్దని రాజగోపాల్ కండిషన్స్ పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించి బెల్ట్ దుకాణాలకు సరఫరా చేస్తే, అధిక ధరలకు మద్యం అమ్మితే సహించేది లేదని హెచ్చరించారు.

దీంతో టెండర్లు వేయడానికి భయపడి ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి వద్దకెళ్లారు మద్యం వ్యాపారులు. ఈ విషయంపై మంత్రి జూపల్లి స్పందిస్తూ, రాష్ట్రమంతా ఒకటే రూల్ ఉంటుందని, ఒక్కో నియోజవర్గానికి ఒక్కో రూల్ ఉండదన్నారు. అందరూ ఫాలో అవ్వాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేశారు జూపల్లి. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై, ప్రభుత్వం అధిష్టానానికి పూర్తి నివేదిక పంపినట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్ పై రోజుకో కామెంట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై వేటు వేయాల్సిందేనని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

మంత్రి పదవి అంశంపై పదే పదే బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. ఇది సొంత పార్టీలోనే చర్చకు దారితీసింది. పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకున్నాను కానీ పార్టీ తనను మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ నుండి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. తనతో పాటు బీజేపీ నుండి వచ్చిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చారు, అతని కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చారు..తనను మాత్రం పక్కన పెట్టారని ఫైరయ్యారు.