Hyderabad: హైదరాబాద్‌లోని అల్వాల్‌లో వెలుగుచూసిన ఈ ఘోర కలియుగం ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. కన్నతల్లి అని కూడా చూడకుండా ఓ కూతురు తన భర్తతో కలిసి తల్లిని అత్యంత దారుణంగా అంతమొందించింది. ఈ దారుణం జరిగి ఏడాది గడుస్తున్నా ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడటమే కాకుండా, శవాన్ని ఏకంగా ఇంట్లోనే పాతిపెట్టి ఏమీ తెలియనట్లు నాటకమాడారు.
హైదరాబాద్ నగరంలో దారుణం
ఏడాది క్రితం తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కూతురు
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో అంజూ అనే మహిళ అదృశ్యమైనట్లు ఏడాది క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
విచారణలో అంజూ చిన్న కూతురు ఇషిక, ఆమె భర్త కుమార్ కలిసి ఆమెను హత్య చేసినట్లు… pic.twitter.com/ADGgVEkEDj
— Telugu Scribe (@TeluguScribe) March 25, 2026
వివరాల్లోకి వెళ్తే.. అంజు అనే మహిళ ఏడాది క్రితం అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీనిపై ఆమె పెద్ద కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పట్లో చిన్న కూతురు, అల్లుడు రకరకాల కట్టుకథలు చెబుతూ పోలీసులను, బంధువులను తప్పుదోవ పట్టించారు. ఆమె ఎక్కడికో వెళ్ళిపోయిందని, తమకు తెలియదని నమ్మబలికారు. అయితే పెద్ద కూతురికి వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు పదే పదే విన్నవించింది.
పోలీసులు తమదైన శైలిలో విచారణను ముమ్మరం చేయడంతో అసలు నిజం బయటపడింది. ఏడాది క్రితమే తల్లిని చంపేసి, బయట ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఇంట్లోనే గొయ్యి తీసి పూడ్చిపెట్టినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ దారుణమైన విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.
ప్రస్తుతం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, మృతదేహం అవశేషాలను వెలికితీసే పనిలో ఉన్నారు. కన్నతల్లిని చంపి ఏడాది పాటు అదే ఇంట్లో కాపురం ఉన్న ఆ కూతురు, అల్లుడి క్రూరత్వం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
