Kukatpally : ప్రేమతో వంచన.. పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ రోజే దారుణం!

Kukatpally

Kukatpally : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే, శోభనం రోజే తన రాక్షస రూపాన్ని బయటపెట్టి భార్య జీవితాన్ని నరకప్రాయం చేశాడు.

తనకు షాపు అద్దెకు కావాలనే నెపంతో బాధితురాలిని సంప్రదించిన నవాజ్ అనే యువకుడు, ఆ తర్వాత ఆమెతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ఆమె తన ప్రేమను అంగీకరించడంతో, నవాజ్ తన పేరును నవదుర్గగా మార్చుకుని 2025 జూన్ నెలలో ఆమెను వివాహం చేసుకున్నాడు.

అయితే పెళ్లయిన మొదటి రోజే నవాజ్ తన అసలు స్వరూపాన్ని చూపించాడు. శోభనం గదిలో భార్యకు మత్తుమందు ఇచ్చి, తన మరో నలుగురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని ఆమెను భయభ్రాంతులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా బాధితురాలికి చెందిన ఫ్లాట్, బంగారంపై పెద్ద మొత్తంలో లోన్లు తీసుకుని నిందితుడు పరారయ్యాడు.

మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఆరా తీయగా, నవాజ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయని, తనది మూడో వివాహమని తెలిసి నివ్వెరపోయింది. ప్రస్తుతం బాధితురాలి ఫిర్యాదుతో కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.