Gas cylinder memes : గ్యాస్ కొరతపై పేలుతున్న మీమ్స్.. సోషల్ మీడియాలో హల్చల్!

Gas cylinder memes

Gas cylinder memes : ప్రస్తుతం ఎక్కడ చూసినా గ్యాస్ సిలిండర్ల ముచ్చటే వినిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ల కొరత వార్తల నేపథ్యంలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ సోషల్ మీడియాను మీమ్స్‌తో నించేస్తున్నారు. ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ అంటే కేవలం వంటగది వస్తువు, కానీ ఇప్పుడు అది ఒక అపురూపమైన ఆస్తిగా మారిపోయిందని మీమర్స్ ఫన్నీగా పోస్ట్లు పెడుతున్నారు.

ముఖ్యంగా తెలుగు సినిమా పోస్టర్లను గ్యాస్ సిలిండర్లతో ముడిపెడుతూ వదులుతున్న మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి. “సిలిండర్ మనదేరా” అంటూ ఎమోషన్ దగ్గర నుండి, “కేజీఎఫ్” స్టైల్‌లో యష్ సిలిండర్ మోయడం వరకు ప్రతిదీ వైరల్ అవుతోంది. దానికి తోడు “హలో గురు సిలిండర్ కోసమే”, “అమ్మ నాన్న ఓ సిలిండర్” అంటూ పాత సినిమాల పేర్లను మార్చేసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

మరికొన్ని మీమ్స్ అయితే.. ఇంట్లో గ్యాస్ అయిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తూ, దాన్ని పొందేందుకు చేసే ప్రయత్నాలను “లక్కీ సిలిండర్” అంటూ సినిమాటిక్ రేంజ్‌లో చూపిస్తున్నాయి. ఏది ఏమైనా, సమస్య ఏదైనా దానికి కాస్త హాస్యాన్ని జోడించి సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మన నెటిజన్లకు వెన్నతో పెట్టిన విద్య. ఈ సిలిండర్ మీమ్స్ ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.