Guvvala Balaraju : నన్ను చంపుతామన్న కేసీఆర్ పట్టించుకోలే… గువ్వల సంచలనం

అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన కామెంట్స్ చేశారు. తనను చంపుతామన్న బెదిరింపులపై కేసీఆర్‌ దృష్టికి తెచ్చిన ఆయన పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆనంతరం ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆ పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక 2009 పార్లమెంట్ ఎన్నికల్లో తనను బలవంతంగా ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారని అన్నారు. 2014, 2018 ఎన్నికల్లోనూ ఎంపీ బీఫామ్‌ ఇవ్వాలని చూశారని చెప్పారు. ఇక మొయినాబాద్‌ ఫాంహౌస్‌ ఘటనలో పట్టుబడితే పట్టించుకోలేదని వాపోయారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన రాజయ్య, కడియం శ్రీహరికి మంత్రి పదువులు ఇచ్చారని మండిపడ్దారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడుగా ఉన్న గువ్వల బాలరాజు సోమవారం (ఆగస్టు 4, 2025) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. గత కొంతకాలంగా పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గడం, 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, అలాగే నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నాయకత్వం ప్రజల్లో బలం లేని రెడీమేడ్ లీడర్స్‌ను నమ్ముకుంటుందని ఆయన విమర్శించారు. గువ్వల బాలరాజు బీజేపీలో చేరే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. ఆగస్టు 9న ఆయన అధికారికంగా బీజేపీలో చేరతారని తెలుస్తోంది. అయితే, ఈ ప్రచారంపై గువ్వల బాలరాజు దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. అచ్చంపేట ప్రజల అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.