Karimnagar : ఈజీ మనీ కోసం దంపతులే కలిసి వేసిన ఒక గలీజ్ ప్లాన్ ఇప్పుడు కరీంనగర్‌లో సంచలనం రేపుతోంది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ జంట, కరీంనగర్ రూరల్ మండలం ఆరేపల్లిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటూ అమాయక యువకులను, వ్యాపారులను వలవేసి లక్షలు దోచుకుంటున్నారు.
నిందితుడు తన భార్య అందాన్ని ఎరగా వాడుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయమైన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసేవాడు. ఆమె ఫోటోలకు ఆకర్షితులయ్యే యువకులు, వ్యాపారులతో చాటింగ్ మొదలుపెట్టి, వారిని నమ్మించి తమ ఇంటికి ఆహ్వానించేవారు. ఆ తర్వాత భర్త ప్లాన్ ప్రకారం భార్య వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్యంగా నగ్న వీడియోలు, ఫోటోలు చిత్రీకరించేవారు.
భార్యాభర్తల గలీజ్ దందా..!
100 మందికి పైగా పురుషులతో శృంగారం చేసి బెదిరించి లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసిన దంపతులు
సామాజిక మాధ్యమాల్లో పురుషులకు వల వేసి వశపర్చుకుంటున్న భార్య.. అనంతరం శృంగార చేసి వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్న దంపతులు
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం… pic.twitter.com/qaAThP180b
— Telugu Scribe (@TeluguScribe) January 15, 2026
వీడియోలు రికార్డ్ చేసిన వెంటనే తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టే ఈ జంట, బాధితులను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టేవారు. డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెడతాం.. మీ కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించి లక్షల రూపాయలు గుంజేవారు. ఇలా ఇప్పటి వరకు సుమారు 100 మందికి పైగా బాధితుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ సొమ్ముతో వారు ఖరీదైన కార్లు, ప్లాట్లు కొనుగోలు చేసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. బాధితుల్లో వ్యాపారులు, వైద్యులు, వైద్య విద్యార్థులు, పలువురు యువకులు ఉన్నారు.
ఓ బాధితుడు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దంపతుల బూతు వ్యాపారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేసి, వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో వందలాది మంది బాధితుల నగ్న వీడియోలు ఉన్నట్లు గుర్తించి పోలీసులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన విచారణ కొనసాగుతోంది.
