Kavitha : కర్మ హిట్స్‌ బ్యాక్‌.. కవిత సంచలన పోస్ట్!

kavitha

Kavitha :  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలుపడ్డాయి.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై విక్టరీ కొట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ బహిష్కరణ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ అమె ట్వీట్ చేశారు.

ఈ పోస్ట్‌కు ఆమె ఎవరి పేరును ట్యాగ్ చేయలేదు. ఉప ఎన్నిక ఫలితాన్ని నేరుగా ప్రస్తావించలేదు. అయితే, సమయం, సందర్భాన్ని బట్టి చూస్తే, ఇది జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమిని ఉద్దేశించే ట్వీట్ చేశారన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది.

కాగా ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 17,061 ఓట్లు పోలయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నిక విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి అనుకూలమైన రెఫరెండంగా భావిస్తోంది.