kavitha : ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. తాను ఖచ్చితంగా సీఎం అవుతానని.. దేవుడి దయవల్ల నాకు అవకాశం వచ్చినప్పుడు ఏ ఒక్కరిని కూడా వదలనన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని అక్రమాలను బయటకు తీస్తానని కవిత హెచ్చరించారు. తనకో అవకాశం వస్తుందని అప్పుడ ఒక్కొక్కళ్ళ సంగతి చేప్తానని అన్నారు.
సీఎం రేవంత్ చెప్పేది ఒక్కటి చేసేది ఒకటన్నారు. తాను తప్పు చేస్తే క్షమాపణ అడిగనన్నారు. తాను తప్పు చేయనని కవిత వెల్లడించారు. బీఆర్ఎస్ ను తాను టార్గెట్ చేయలేదన్నారు. తాను గాంధీ తాత లాగా కేసీఆర్ లాగా మంచిదాన్ని కాదు అని ఒకటి కొడితే రెండు దెబ్బలు కొట్టేదాన్ని అని చెప్పుకొచ్చారు.
తనపై ఆరోపణలు చేస్తున్న వారికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే నేను చేసిన ఆరోపణలకు జవాబు చెప్పండి. అంతేకానీ.. నామీద ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకోను. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు. మీరు చేసిన అక్రమాలను నాపై రుద్దొద్దు. నాకు ఎవరితోనూ ఎలాంటి అండర్‌స్టాండింగ్ లేదని కవిత పేర్కొన్నారు.
మరోవైపు MLAలు మహేశ్వర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావుకు కవిత లీగల్ నోటీసులు పంపించారు. తనపై, తన భర్తపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని నోటీసులిచ్చారు. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
