Kavitha : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో కుట్రలు జరిగాయని ఆమె ఆరోపించారు.. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో పని చేయలేదన్నారు. నిజంగానే ప్రజల కోసం పని చేసి ఉంటే ఫలితాలు మరొలా ఉండేవని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం తప్ప కింది స్థాయిలో పని చేయలేదని చెప్పారు.. కృష్ణార్జునుల్లా హరీష్, కేటీఆర్ సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదని విమర్శించారు.
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం కూచన్ పల్లిలో పాడి రైతులతో సమావేశం అయ్యారు కవిత.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు టార్గెట్‌గా కవిత విమర్శలు చేశారు. రెడ్డిపల్లిలో హరీష్ 400 ఎకరాల ఫాంహౌస్ కట్టారని.. ఇందుకోసం రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చారని ఆరోపించారు. దీనివల్ల 56 మంది రైతుల 59 ఎకరాలు పోతున్నాయని చెప్పారు.
ఎకరం, అర ఎకరం ఉన్న చిన్న రైతులు నష్టపోతున్నారని కవిత వెల్లడించారు. కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి ఇలా చేశారని కవిత ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేసిన అక్రమాలన్నీటికీ హరీష్ రావు అండగా ఉన్నారని ఆరోపించారు. హరీష్ రావు కుటుంబం, ప్రైవేట్ గా పాల వ్యాపారాలు చేసి పాల రైతులకు అన్యాయం చేసిందని.. ఎలాంటి టెండర్లు లేకుండానే హాస్టళ్లకు పాలు సప్లై చేసి డబ్బు సంపాదించుకున్నారని ఆరోపించారు కవిత.
బచ్చగాళ్లు బచ్చగాళ్ల లెక్కుండాలే : కవిత pic.twitter.com/orFVRatZRi
— V6 News (@V6News) November 15, 2025
ఇక బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. “కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన బయటికి వస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్‌పై అవాస్తవ ప్రచారం మానుకోవాలని కవిత హితవు పలికారు. మెదక్ లో బీఆర్ఎస్ అధోగతి పాలు కావడానికి స్థానిక నేతల అరచాకలే కారణమన్నారు కవిత. కేసీఆర్ కళ్ళకు గంతలు కట్టి విచ్చలవిడిగా వ్యవహరించారని .. ఈ అన్ని విషయాలు కేసీఆర్ కు తెలిస్తే వారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించరని కవిత తెలిపారు. కేసీఆర్ ముందు మనం బచ్చగాళ్లు బచ్చగాళ్ల లెక్కుంటే మంచిగా ఉంటుందని చెప్పారు.
