KCR : అసెంబ్లీ, శాసన మండలిలో అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టారు. ఇందులో భాగంగా అనుభవజ్ఞులైన నేతలకు సభలో కీలక బాధ్యతలు అప్పగించారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లగా ముగ్గురు మాజీ మంత్రులు హరీష్ రావు, పటోల్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను నియమించారు. ఇక మండలిలో పార్టీ గొంతుకను బలంగా వినిపించేందుకు ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు.
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ను మండలిలో పార్టీ విప్‌గా కేసీఆర్ ఖరారు చేశారు. ఇక అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా కేసీఆర్, మండలిలో ఫ్లోర్ లీడర్ గా మధుసూదనాచారి ఉన్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఉండటంతో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించలేదని తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ పాలిటిక్స్ లో ఫుల్ యాక్టివ్ అయ్యారు.
