Nagole : ఉసురు తీసిన అక్రమ సంబంధం.. వివాహిత ఆత్మహత్య!

Nagole : హైదరాబాద్ నాగోల్ పరిధిలో వివాహేతర సంబంధం ఒకరి ఉసురు తీసింది. ఈనెల 21న ప్రియుడి ఇంట్లో ఉరివేసుకొని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషయం… ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లాకు ఓ మహిళకు నాగోల్ లో నివాసముంటున్న బానోత్ అనిల్ నాయక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

అదికాస్త వివాహేతర బంధంగా మారింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం కుమారుడికి చికిత్స చేయిస్తానని చెప్పి….. ప్రియుడితో గడిపేందుకు నాగోల్ వచ్చింది. రెండు రోజులుగా అనిల్ ఇంట్లోనే ఉంది. కూరగాయల కోసం అనిల్ .. బయటకు వెళ్లి తిరిగి వచ్చాడు. బాత్రూములో హ్యాంగర్ కు చీరతో ఉరివేసుకుంటున్న మహిళను చూసి షాక్ గురయ్యాడు.

చుట్టుపక్కన వారిని సహాయం కోసం పిలిస్తే పరువు పోతుందని ఆలోచించి.. తానే తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. కానీ…! అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచింది. భయంతో అనిల్ చేయి కోసుకొని ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. కానీ ఎదురుగా ఏడుస్తున్న మూడేళ్ల చిన్నారిని చూసి చేతికి గుడ్డ కట్టుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

మృతురాలి బంధువులు నాగోల్ చేరుకుని అనిల్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ అనిల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని రిమాండ్ కు తరలించారు..